సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుండి గోదావరి జిల్లాలకు చేరుకోవాలంటే రైళ్లు, బస్సులు అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా కష్టంగా ఉంది. అయితే ట్రైన్ లో చక్కగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాడేపల్లి గూడెం మీదుగా వెళ్లే ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఇంకా టికెట్స్ ఖాళీగా ఉన్నాయి. మరి ప్రయాణికులు త్వరపడండి. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రత్యేక రైలు నడుపుతోంది. మంగళ, గురు, ఆదివారాల్లో నడిచే ఈ రైలులో జనవరి 14వ తేదీన బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో 14వ తేదీ రాత్రి 7.20 గంటలకు బయలుదేరే ఈరైలు 15వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, విజయనగరం జంక్షన్, మీదుగా ఈ రైలు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ తరగతులు ఈరైలులో అందుబాటులో ఉండగా నేడు,మంగళవారం (7 జనవరి 2025) ఉదయం10గంటల పమయానికి స్లీపర్ క్లాస్‌లో 400 బెర్తులు అందుబాటులో ఉండగా.. ఏసీ త్రీటైర్‌లో 148, ఏసీ టు టైర్‌లో 60, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో నాలుగు బెర్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరో రైలు… కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 15వ తేదీన కూడా ఏసీ ప్రత్యేక రైలు నడపనుంది. దీనికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు జనవరి 15వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతూ శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈరైలులో కేవలం ఏసీ త్రీ టైర్ బెర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నేడు మంగళవారం (7 జనవరి 2025) ఉదయం 10 గంటల పమయానికి థర్డ్ ఏసీలో వెయ్యికి పైగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
