సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్య భారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న ఒడిషా, ఉత్తరాంధ్ర జిల్లాలు.. తెలంగాణకు ఆనుకుని గోదావరి , కోస్తా జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత 3రోజులుగా తీవ్ర చలిగాలులు తోడయి గోదావరి జిల్లాలలో మంచు దుపట్ల లో చలి పులి ప్రజలపై దాడి చేస్తుంది. పెద్దలు పిల్లలు వైరల్ జ్వరాలు , ఒళ్లునొప్పులుతో బాధపడుతున్నారు. మరో ప్రక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షపు ముసురు.. నేడు, బుధవారం మరింత తీవ్రతరం అయ్యింది. అల్పపీడనం ప్రభావంతో గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, తిరుపతి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. . ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు మూడ్రోజులపాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.కోస్తా జిల్లాల్లో వరి, ప్రత్తి, పొగాకు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
