సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో విస్తారంగా పండే కొబ్బరి రైతులను ఆదుకునేందుకు పరిణితి చెందిన కొబ్బరి కాయలను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రైతులవద్ద పరిణితి చెందిన కొబ్బరి (ముక్కడు) కాయలు, పిలకకాయలకు, బోడకాయలకు రూ.3,013 వంతున కొనుగోలు చేసేందుకు మద్దతు ధర ప్రకటించింది.ఈ కొనుగోలు బాధ్యతను కేంద్రం నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యుమర్ ఫెడరేషన్‌లకు అప్పగించింది. వీటి ద్వారా రైతులవద్ద నేరుగా వలిచిన కొబ్బరికాయలను క్వింటాళ్లు వంతున కొనుగోలు చేస్తారు. వీటిని అనంతరం ఫార్మర్స్ ప్రొడ్యుసర్స్ కంపెనీ (ఎఫ్‌పీవో)లకు విక్రయించి వాటి ద్వారా కోప్రా తయారు చేయించుకుని వారి నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని ద్వారా గోదావరి జిల్లాలలో ఇటీవల తగినంత డిమాండ్ లేక రైతుల వద్ద నిల్వఉన్న కాయలను కొనుగోలు చేయడంతోకొబ్బరి రైతులకు కొంతమేర ఊరట లభిస్తుంది.
