సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన ఏడాది, సంక్రాంతి పండుగల నేపథ్యంలో, రేషన్ దుకాణాల్లో గోదావరి జిల్లాలో లబ్ధిదారులకు 1కేజీ రూ20 చప్పున గోధుమ పిండి ( wheat) పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. తొలుత పట్టణాల్లో రేషన్ షాపు ల్లో పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. దీంతో వచ్చే నెల ఒకటోతేదీ నుంచి గోధుమపిండి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోధుమ పిండి కిలో బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి 60 వరకు ధర ఉంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరలకే తొలివిడతలో పట్టణాల్లో లబ్ధిదారులకు అందజేసి తర్వాత రెండో విడతలో గ్రామీణవాసులకు రేషన్ షాపుల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
