సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. భీమవరం అంతటా గత రాత్రి నుండి కుండపోతగా కురుస్తున్న వర్షం నేటి బుధవారం ఉదయం కూడా కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక్కడి నుండి విజయవాడకు భారీ ఎత్తున వేలాది పాకెట్స్ ఆహారం పంపుతున్న దాతల, స్వచ్చంద సేవలకు అంతరాయం కలుగుతుంది. ఇక అసలే పీకల లోతు వరద కష్టాలలో ఉన్న కృష్ణ గుంటూరు ప్రజలను పకృతి పగబట్టిన రీతిలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. నేటి బుధవారం నుండి ఉభయ గోదావరి జిల్లాల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం భద్రాచలం వద్ద 42.2అడుగుల నీటిమట్టం కొనసాగుతోందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 3,05,043లక్షలు కాగా.. ఔట్ ఫ్లో 3,12,057లక్షల క్యూసెక్కులు ఉందని ఆయన తెలిపారు. విజయవాడ అనుభవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. జిల్లాలో అన్ని విద్యాసంస్థలు నేడు మూసివేశారు.
