సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా యానాం సమీపంలోని గోదావరి జిల్లాలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, చలిగాలుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గోదావరి జిల్లాలను అనుకొనిఉన్న కేంద్ర పాలిత యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా చలి గాలులు బలంగా వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.ఇక, రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *