సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే ఈ నెల 27బ కేరళ (Kerala)ను తాకనున్నాయి. రేపు మంగళవారం భారతదేశంలోని దక్షిణ అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు సోమవారం ఏపీలో 42 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. భీమవరంలో ఉదయం 10 గంటల నుండి భారీ వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం పట్టణంలో దుకాణాలు కూడా కట్టేసారు. రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పోగోదావరి జిల్లాల్లోని 29 మండల్లో తీవ్రంగా.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది.
