సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క వేసవి సమీపిస్తున్నప్పటికీ కోస్తా ఆంధ్ర లోని పలు జిల్లాల్లో గత కొద్దీ రోజులుగా ఉదయం 8గంటల వరకు పొగమంచు కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం ఎండ ఉన్నపటికీ చల్లఁదనం కూడా ఉంటుంది. నేడు, బుధవారం . తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ పశ్చిమ గోదావరి ,ఏలూరు పార్వతీపురం మన్యం, విజయనగరం, జిల్లాల్లో ఎక్కువచోట్ల, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పొగ మంచు ప్రభావం కనిపించింది. తెల్లవారు జాము వాహన ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి గాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కోస్తాలో సాధారణం కంటే తక్కువగా, రాయలసీమలో సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో అక్కడక్కడ పొగ మంచు ప్రభావం ఉంటుందని, వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *