సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండాకాలం కొబ్బరి బోండాలకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికి తెలిసిందే.. కొబ్బరి పంట ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం రిటైల్ గా కొబ్బరి కాయ కానీ, బొండం కానీ రిటైల్ గా 20 రూ కు అమ్మడం సర్వసాధారం. అందరికి తెలసిందే..రిటైల్ వ్యాపారం బాగానే ఉంది, అయితే కొబ్బరి చెట్లు సాగు చేస్తున్న రైతుకు మాత్రం గత 4ఏళ్లుగా పరిస్థితి కొంతవరకు బాగున్నప్పటికీ ఈ వేసివి సీజన్ మాత్రం నష్టాలు వస్తుండటం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లాల లో ఇటీవల కొబ్బరి ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సంక్రాంతికి ముందు రైతు నుండి పచ్చి కొబ్బరి కొనుగోలు ధర వెయ్యి కాయలు రూ.9 వేలు ఉండగా ఇపుడు రూ. 6 వేలకు పడిపోవడం దారుణం అని రైతులు వాపోతున్నారు. కారణాలు చుస్తే బోండాలకు డిమాండ్ ఉన్నప్పటికీ కొబ్బరి కాయలకు కేరళతో పాటు ఇటీవల తమిళనాడు కొబ్బరి పోటీ ఇవ్వడం తో నాణ్యమైన కొబ్బరికి సైతం ఎగుమతి ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు, నిక్కచ్చిగా రైతుకు కాయకు రూ.4 కూడా దక్కడం లేదు. చెట్ల నుంచి కాయలు దింపడానికి ఒక్కొ కాయకి రూ. 2 పెట్టుబడి పెట్టాల్సి వస్తుండగా కాయలు దింపి వాటిని అయినకాడికి అమ్మిన సరే.. ఎగుమతులు చేయించే నాటికీ లాభాలు మాట దేవుడు ఎరుగు ..దింపుడు, తొక్క వలిపించే కూలి, రవాణా ఖర్చులతో ఈ సీజన్ష్టాలు లో మునిగిపోవడం ఖాయం అని కొబ్బరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *