సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి పుష్క రాలు సమీపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలోని గోదావరి నది పరివాహక ఉమ్మడి గోదావరి జిల్లాలలో వయస్సుకు వచ్చిన పిల్లల తల్లి తండ్రులు పెళ్లి సంబంధాలు మరియు పెళ్లి ముహూర్తాల వేటలో పడ్డారు. ఎందుకంటే పుష్కరాలకు కేవలం 14 నెలలు సమయం మాత్రమే ఉంది. పురాతన సంప్రదాయం ప్రకారం పుష్కరాల తరువాత ఏడాది కాలం పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలలో పుట్టి పెరిగిన యువతి యువకులకు ఎటువంటి వివాహాది శు భకార్యాలు జరుపుకోరు. గోదావరి జిల్లాల వాసులు చనిపోయిన తమ పితృ దేవతలకు పుష్కరాల సమయంలో పవిత్ర గోదావరి నదిలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు . అందు వల్ల ఒక ఏడాది పాటు శుభకార్యాలు జరపకూడదని పురోహితులు చెబుతున్నారు. అందుకే ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లిళ్లు పూర్తీ చేస్తే మంచిది అని భావిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇటీవల పెళ్లి ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, సీజన్ లో కల్యాణ మండపాల రెంట్లు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ,విందులో ఐటమ్స్ రేట్లు, పెళ్లి నిర్వాహక ద్రవ్యాలు లేబర్ చార్జీలు భారీగా పెరిగి పోయాయని సామాన్య , మధ్య తరగతి వర్గాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *