సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో ఆక్వా రంగ ఉత్పతులు ఎగుమతులలో ఆంధ్ర ప్రదేశ్ ప్రధమ స్థానం. ఆక్వా వ్యవసాయంలో రొయ్య ను పండించడంతో ఉభయగోదావరి జిల్లాలు,రైతులదీ అగ్రస్థానం.. అయితే గత 5ఏళ్లుగా మంచినీటిలో పెరిగే వనామీ పెంపకంలోభారీ నష్టాలు వస్తుండటంతో పాటు రొయ్య ఎగుమతులతో యాంటీ బయోటిక్స్ సమస్య మన ప్రాంత రైతులను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో వారికో శుభవార్త.. ఆక్వా రంగంలోకి సరికొత్త రకం రొయ్య(స్కాంపీ) రంగ ప్రవేశం చేసింది. ఇటీవల దేశంలో తిరిగి మంచినీటి రొయ్యల సాగును ప్రోత్సహించాలని కేంద్రం మంచి నీటి రొయ్యల సాగుకు సంస్థ (సీఐఎఫ్‌ఏ) ఆదేశించింది. రైతులకు నాణ్యమైన సీడ్ అందించేందుకు సీఐఎఫ్‌ఏ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు మంజూరు చేసింది. అందులో కాకినాడలో ఎంఎస్‌ఆర్ స్కాంపీ హేచరీ ఉంది. అది ఇప్పటికే హేచరీలో సీడ్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏప్రిల్ నాటికి రైతులకు నాణ్యమైన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వనామీ రొయ్యల సాగుతో పోలిస్తే స్కాంపీ సాగుకు పెట్టుబడి తక్కువ. ఎకరాకు రూ.2 లక్షలు సరిపోతుంది. సహజంగా వైరస్‌లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. మందుల అతి వినియోగం ఉండదు. పలువురు రైతులకు ఇప్పటికే ఆక్వా నిపుణులను సంప్రదించి స్కాంపీ రొయ్యలు సాగు చేయడానికి చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు.
