సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలో ముఖ్యముగా పాలకొల్లు, కోనసీమ ప్రాంతాలలో దశాబ్దాలుగా కొబ్బరి ఉత్పతులు ఎక్కువ గా జరుగుతాయి. గత దశబ్దంగా ప్రక్క రాష్టాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో కొబ్బరి సాగు పెరగడంతో పోటీ పెరగటంతో ఈ ప్రాంతం కొబ్బరి ధరకు కొనుగోలు కు కొంత డిమాండ్ తగ్గింది. అయితే ఇటీవల కాలంలో కొబ్బరి ధర నిలకడగా ఉంది. డిమాండ్ పెరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు విచిత్రంగా గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల దిగుబడి బాగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు రిటైల్‌ మార్కెట్‌లో కొబ్బరికాయ సైజ్‌ను బట్టి రూ15 నుంచి 30 అమ్ముతున్నారు. దిగుబడి తగ్గడంతో ప్రత్యక్షంగా రైతులు పరోక్షంగా కొబ్బరి రిటైల్ వ్యాపారులు నష్టపోతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గతంలో లేనివిధంగా కొబ్బరి దిగుబడులు సగానికి సగం తగ్గిపోయింది. నెలకి వెయ్యి కాయలు దించే కొబ్బరి రైతుకి ఇప్పుడు 500 దిగుబడి రావడం కష్టంగా మారింది. ఇక్కడ కొబ్బరి చెట్ల వయస్సు పెద్దది కావడం మరోవైపు నల్లి తెగులు వ్యాప్తి ఇతరత్రాకారణాలతో కొబ్బరికాయ నాణ్యత తగ్గుతుంది. ఇక్కడ రైతుల దగ్గర కొబ్బరి కాయ రూ.9నుంచి 11కు హోల్ సేల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.ఢిల్లీ క్వాలిటీ గంగాబోండం కాయలు రైతు వద్ద 13 రూపాయలు వరకు పలుకగా మార్కెట్ లో 30 రూపాయలు వరకు ఉంటుంది. చిన్నసైజ్ బత్తీల ధర రూ.8 వరకు పలుకుతుంది. ఏది ఏమైనా ఉద్యాన వన అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సహకరిస్తే మరల కొబ్బరి దిగుబడి పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *