సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచు కుని దక్షిణ మద్య రైల్వే విజయవాడ సెక్షన్ పరిధిలో గోదావరి జిల్లాల మీదుగా ఎనిమిది సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు. ఈ మేరకు 07027 నంబరు గల హైద్రాబాద్- బెరహమ్‌పూర్ మధ్య రాకపోకలు సాగించేందుకు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13 తేదీ శనివారం ఒక ట్రిప్ బయలుదేరనుంది. ఈ రైలు శనివారం హైద్రాబాద్‌లో రాత్రి 10.40 నిమిషాలకు బయలుదేరి శనివారం సాయంత్రం 3.15 గంటలకు బెరహమ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి మీదుగా అన్నవరం 8.45కి చేరుకుని అనకాపల్లి మీదుగా బెరహమ్‌పూర్‌కు ఆదివారం సాయంత్రం 3.15కి వెళుతుంది.మరల తిరుగు ప్రయాణం లో 07028 నంబరు గల బెరహమ్‌పూర్-హైద్రాబాద్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం జనవరి 14 తేదీ సాయంత్రం 6.00కి బయలుదేరి అన్నవరానికి అర్ధరాత్రి 12.43కి చేరుకుంటుందని, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, సికింద్రాబాద్ మీదుగా హైద్రాబాద్‌కు సోమవారం ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. 07022 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనవరి 12న శుక్రవారం సాయంత్రం 5.40కి బయలుదేరనుంది. ఈ రైలు నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్ కు రాత్రి 9 గంటలకు.. , ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, సికింద్రాబాద్‌కు శనివారం తెల్లవారుజామున 5.55కి చేరుకుంటుంది. తిరిగి 07221 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-కాకినాడ మధ్య జనవరి 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనుంది. ఈ రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ కు తెల్లవారు జాము 4గంటల సమయంలో.. , తణుకు, నిడదవోలు మీదుగా రాజమండ్రికి శుక్రవారం ఉదయం 6.10కి చేరుకుని, అనపర్తికి 6.30కి, సామర్లకోటకు 6.50కి, కాకినాడకు 8 గంటలకు చేరుకుంటుంది. 07025 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-బెరహమ్‌పూర్ మధ్య జనవరి 12,19 తేదీలలో ప్రతీ శుక్రవారాలలో బయలుదేరనున్నాయి. ఈ రైలు శుక్రవారం రాత్రి 7.45కి సికింద్రాబాద్‌లో బయలుదేరి , విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా రాజమండ్రికి శనివారం తెల్లవారుజామున 3.08కి చేరుకుని, అన్నవరం ఇచ్ఛాపురం మీదుగా బెరహమ్‌పూర్‌కు శనివారం ఉదయం 11.15కి చేరుకుంటుంది. 07026 రైలు బెరహమ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య జనవరి 13,20 తేదీలలో ప్రతీ శనివారాలలో మధ్యాహ్నం 12.30కి బయలుదేరనున్నాయి. ఈ రైలు బెరహమ్‌పూర్‌లో మధ్యాహ్నం 12.30కి బయలుదేరి ఇచ్చాపురం,అనకాపల్లి మీదుగా అన్నవరానికి సాయంత్రం 6.23కి చేరుకుని రాజమండ్రికి రాత్రి 7.55కి చేరుకుని తాడేపల్లిగూడెం 9-15, ఏలూరు, విజయవాడ, మీదుగా సికింద్రాబాద్‌కు ఆదివారం ఉదయం 6.30కి చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు, రైలు రిజర్వేషన్ టిక్కెట్లకు సమీప రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయాల వద్ద సంప్రదించండి.
