సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఈ నెల 27న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నటు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జాబ్‌ మేళాలో ప్రఖ్యాత కంపెనీలు మదర్‌, ఫాదర్‌ కేర్‌ హోం నర్సింగ్‌ సర్వీసెస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, మెడ్‌ ప్లస్‌ ఫార్మసీ, అపోలో ఫార్మసీ, వరుణ్‌ మోటార్స్‌, పేటియం, నవత రోడ్‌ ట్రాన్స్‌పోర్టు, ఆస్ట్రో టెక్‌ స్టీల్‌ తదితర మొత్తం పది నుంచి పదమూడు కంపెనీల వరకు పాల్గొననున్నట్లు పీవో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు వరకు ఉన్న ఇంటర్‌ మీడియట్‌ ఆపై చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని పీవో కోరారు. ఎర్రంపేటలోని ఏపీఆర్‌ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు పొందే అవకాశం ఉందన్నారు. చింతూరు ఐటీడీఏ, ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తోందన్నారు. అభ్యర్థులు తమ ఆధార్‌ కార్డు, సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని సూచించారు. ఒక అభ్యర్థి ఒకటి నుంచి రెండు మూడు కంపెనీలలో దరఖాస్తు చేసుకోవచ్చని, చివరకు అతడికి నచ్చిన లేదా ఎంపికైన కంపెనీలో ఉద్యోగం పొందవచ్చన్నారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులు ఆయా కంపెనీలలో జాయిన్‌ అయ్యేంత వరకు ఐటీడీఏ భరోసా తీసుకుంటుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *