సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల వాహనదారులకు ప్రయాణికులకు ముఖ్య గమనిక ఏమిటంటే.. నిడదవోలులో రైల్వేగేటును మరమ్మతుల నిమిత్తం 10 రోజులపాటు మూసివేయనున్నారు. రైల్వే ట్రాక్ మర మ్మతుల కారణంగా ఈనెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ ఆదివారం సాయత్రం 5 గంటల వరకు రైల్వే గేటు మూసివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలువచ్చాయి. రైల్వే గేటు మూసివేతతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళ్లే వాహనదార్లు వేరే మార్గాల్లో వెళ్ళవలసి ఉంది. ఇప్పటికే కొవ్వూరు రోడ్కం రైలు బ్రిడ్జి మూసి వేతతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇటు నిడదవోలు రైల్వే గేటు మూసివేతతో మరింత దూరం పెరుగుతుంది.
