సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి నది వరద ఉదృతి ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది. ( ఫై తాజా చిత్రం లో చూడవచ్చు) ఉమ్మడి ఉభయ ఉభయ గోదావరి జిల్లాలను కలుపే ప్రధాన వంతెన రాజమహేంద్రవరం-కొవ్వూరును అనుసంధానిస్తూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నుంచి నిలిపివేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఉత్తర్వులిచ్చారు. బస్సులు, లారీలు, లోడ్ వాహనాలు గామన్ వంతెన మీదుగా వెళ్లాలని ఆదేశించారు. వంతెనపై నుంచి కేవలం ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొ న్నారు. అయితే ఈ నిషేధం ఎప్పటివరకు అమల్లో ఉంటుందన్నది ఉత్తర్వుల్లో వెల్లడించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికముగా బస్సులు, లారీలు ఇతర వాహనాలు మళ్లించడంతో వంతెన వరకు వచ్చిన వారిలో అసహనం పెరుగుతుంది. కాబ్బటి ఈ విషయం అందరికి షేర్ చెయ్యవలసిన అవసరం ఉంది.
