సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; మిత్రుడు ప్రభాస్ నిర్మించిన ‘ జిల్’ సినిమా తరువాత గత 5 ఏళ్లుగా సరైన హిట్ లేని హీరో గోపీచంద్ తనకు లక్ష్యం, లౌక్యం వంటి 2 హిట్ లు ఇచ్చిన శ్రీవాస్ దర్శకుడిగా నందమూరి బాలకృష్ణ టైటిల్ నామకరణం చేసిన ‘రామ బాణం’ అనే సినిమాతో నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలో నటించారు. ఇది ఇద్దరి అన్నదమ్ముల కథ, మంచి మెసేజ్ ఉంటుంది, కుటుంబం అంత చూడొచ్చు, అంటూ ట్రైలర్ లో ఇంటర్యూలలో జనానికి హైప్ పెంచారు. అయితే ఈ సినిమా ఎలా వుంది, గోపీచంద్ కి బ్రేక్ వస్తుందా? చూడాలి. కధ విషయానికి వస్తే.. రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) రఘురామ పురం అనే వూర్లో ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. పాపారావు (నాసర్) అనే విలన్ రాజారామ్ హోటల్ మూయించాలని చూస్తూ ఉంటాడు. రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) అన్నయ్యలా ఓపిక పాటించడు, దెబ్బకు దెబ్బ అనే మనిషి. ఒకసారి పాపారావు, రాజారాం హోటల్ కి వచ్చి బెదిరిస్తే, వాడిని విక్కీ కొడతాడు. తమ్ముడు చేసింది తప్పు అంటాడు రాజారాం, కానీ విక్కీ అదే రైటు అంటాడు. ఇద్దరూ వాదించుకోవటంలో అన్న చేసింది తప్పని, విక్కీ ఊరు వదిలి కలకత్తా పారిపోయి అక్కడ పెద్ద డాన్ గా ఎదుగుతాడు. మరల 14 సంవత్సరాల తర్వాత విక్కీ తనకి కుటుంబం ఉందని చెప్పి మళ్ళీ అన్న దగ్గరకి వస్తాడు. మరల అన్నకి సమస్య, తనకి కూడా సమస్య వస్తాయి. ఇంతకీ ఏమిటా సమస్యలు,రామబాణం’ చూసి తెలుసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా పాత తరహా కద తో అదేస్థాయి పాత తరహా టేకింగ్ తో తీసిన సినిమా.. విరామం ముందు వచ్చే సన్నివేశం, అలాగే క్లైమాక్స్ లో జగపతి బాబు సన్నివేశం ఆకట్టుకుంటాయి. చివర్లో ఏవో ఒక రెండు మూడు ఆర్గానిక్ ఆహారం గొప్ప తనం చెప్పినంత మాత్రాన సరిపోదు,ఇక షరా మాములే.. అందరికి వారి పాత్రలు కొట్టిన పిండే.. హిందీ విలన్స్ పెద్దగా అరుస్తూ మాట్లాడతారు అంతే.. ఇటువంటి సినిమా తో గోపీచంద్ ఎలా హిట్ కొట్టగలడో ? ముందే ఆలోచించుకోవలసింది.. కాలక్షేపం సినిమా అంతే ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *