సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అసెంబ్లీ కి కూటమి బలపరుస్తున్న జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు నేడు సోమవారం బ్యాంకు కాలనిలో పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు ను వినియోగించుకొన్నారు. ఆయన పట్టణంలోని ఇతర బూత్ లు పరిశీలన చేస్తుండగా యాదృచ్చికంగా అదే పని మీద బూత్ లలో ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సోదరుడు గ్రంధి చల్లారావు మరియు , కుమారుడు గ్రంధి రవితేజ ఒకరికొకరు ఎదురు కావడంతో కొద్దీ సేపు వారిరువురి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు జరిగాయి. ఫై చిత్రంలో చూడవచ్చు.. రాజకీయ రంగంలో ప్రత్యర్దులయిన భీమవరం పట్టణంలో వ్యక్తిగతంగా కలుసుకొన్నపుడు నేతలు చుపుకొనే సంస్కారం, ప్రశాంతత ఈ రకంగా ఉంటుంది. అంతే కానీ ఎవరెవరో ఆరోపించినట్లు , ఉహించుకొన్నట్లు ఇక్కడ గలాటాలు కొట్లాటలు ఉండవు అని మరోసారి రుజువు అయ్యింది.
