సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండవ రోజు నేడు గురువారం కూడా ఐటీ సోదాలు (IT Rides) కొనసాగుతున్నాయి. గత బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. నిన్న నేడు కూడా గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములుగా భావిస్తున్న వారి ఇళ్లల్లోనూ కూడా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.. 8 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆక్వా ఇతర వ్యాపారాలకు సంబంధించి రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు 2రోజులు గా కొనసాగుతున్నాయి. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి ఇంటికి చేరుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సాగర్‌ గ్రంధి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీవీఆర్‌)లో కూడా 11 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అని సమాచారం. తెలంగాణకు చెందిన 9 మంది ఐటీ అధికారులు.. ఆ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో నాగాయలంకలోని లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో లో గ్రంధి శ్రీనివాస్ తో భీమవరం లో పోటీపడి ఓడిపోయిన జనసేనాని గత ఎన్నికల ప్రచారంలోనూ గ్రంధి ని హెచ్చరించడం.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల గ్రంధి ఫై ద్రుష్టి పెట్టడం కలెక్టర్ కి పిర్యాదు చెయ్యడం దరిమిలా..కేంద్రం నుండి అధికారులు దర్యాప్తుకు రావడం పవన్ నిన్న ఢిల్లీ వెళ్ళటం కేంద్రంలో అమిత్ షాను ఇతర అధికారులను కలవడం దరిమిలా ఇక్కడ గ్రంధితో వ్యాపార సంబధీకుల ఫై ఐటి దాడులు కొనసాగుతుండటం వారి అనుమానాలు నివృత్తి చేసుకోవడంలో భాగమా ? లేదా మరి ఏదయినా కారణమా ? అని స్థానిక ప్రజలలో చర్చ జరుగుతుంది.ఐటి అధికారులు దర్యాప్తు పూర్తీ అయ్యాక వాస్తవాలు అధికారికంగా వివరించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *