సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే ‘గ్రంధి శ్రీనివాస్’ ఈఅమావాస్య వెళ్ళాక టీడీపీ లో చేరతారని గోదావరి జిల్లాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా పాలోయింగ్ ఉన్న మాస్ లీడర్.. గ్రంధి ని టీడీపీ లో చేర్చుకొంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భీమవరం టీడీపీ లో కొందరు నేతలు సానుకూలంగా టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకోని వెళ్లారు. మెసేజ్ ల రూపంలో తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కొందరు టీడీపీ అగ్ర నేతలు గ్రంధి రాక.. అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా 2019 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే ఓడించి తెలుగురాష్ట్రాలలో తన చరిష్మా చాటుకున్న గ్రంధి శ్రీనివాస్ కు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎప్పుడు ఆయన స్థాయికి తగ్గ గౌరవం కానీ పదవి కానీ ఇవ్వలేదన్నది ఆయన లోను, ఆయన అభిమానులలో జీర్ణించుకోలేని బాధ గా మిగిలి పోయింది. 2024 ఎన్నికలలో గ్రంధి శ్రీనివాస్ ఓటమి తరువాత వైసీపీ పార్టీకే కాదు గత 5 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గ్రంధి ని వైసీపీ పార్టీలో మరల యాక్టీవ్ చెయ్యడానికి మాజీ సీఎం జగన్ ఆదేశాలతో ఉమ్మడి గోదావరి జిల్లాలకు, కృష్ణ జిల్లా కు చెందిన మాజీ మంత్రులు పలువురు ఇప్పటికే పలు ధపాలుగా గ్రంధి తో అయన నివాసం కు వచ్చి చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే గ్రంధి వారితో తాను పార్టీలో దశాబ్దం పైగా ఎన్ని అవమానాలు భరించానో, పార్టీ నిర్వహణ కోసం ఆర్ధికంగాఎంత నష్టపోయానో ఏకరువు పెడుతూనే.. పార్టీకి దూరం పాటిస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా.. భీమవరం శివారులోని పెద అమిరంలో గత శుక్రవారం జిల్లా వైసీపీ ముఖ్యనేతలు మాజీ మంత్రులు, మండలి చైర్మెన్ తో సమావేశమయ్యారు. దీనికి కూడా గ్రంధి హాజరు కాలేదు. ఏది ఏమైనా 40 ఏళ్ళు పైగా టీడీపీ తో మడమ త్రిప్పకుండా పోరాడుతున్నమాజీ ఎమ్మెల్యే గ్రంధి ప్యూహాత్మకంగా ఇప్పుడు అదే టీడీపీ లో చేరాలంటే పార్టీ అధిష్టానం నుండి ‘మంచి రాజకీయ భరోసా’‘ లభించవలసి ఉంటుంది.. అప్పుడు ఇదే మంచి ముహూర్తం కావచ్చు.. లేని పక్షంలో మరో 6 నెలలు విరామం తప్పదు..అప్పుడు పరిస్థితుల బట్టి టీడీపీ లో చేరవచ్చు..లేదా వైసీపీలోనే కొనసాగవచ్చు అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరో కోణంలో చుస్తే .. అతి త్వరలో భీమవరం మునిసిపల్ ఎన్నికలు లేదా అనుకున్నట్లు జరిగితే.. గ్రేటర్ భీమవరం కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భీమవరం ఎమ్మెల్యే సిటు కూటమి మద్దతు తో జనసేన పార్టీ తరపున పులపర్తి అంజిబాబు గెలుపొందారు. మరల భీమవరంలో టీడీపీ ప్రతిష్ట పెంచుకోవాలంటే మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ చైర్ పర్సన్ లేదా మేయర్ అభ్యర్థి పోటీ తప్పనిసరి.. మరి రాజకీయాలలో ప్యూహా ప్రతి పుహల కు భీమవరం మరోసారి వేదిక కానుంది.
