సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూకే లో గత బ్రిటిష్ ప్రధానిగా పనిచేసిన ఋషి సునక్ కు పార్టీ ఎన్నికల ప్రచార ఇంచార్జి గా అత్యంత సన్నిహితంగా పని చేసి.. ప్రస్తుతం లండన్ డిప్యూటీ మేయర్ గా, ఎన్నికలలో గెలిచిన తెలుగువాడు, భీమవరం మండలం తుందుర్రు గ్రామ వాసి ఆరేటి ఆర్యన్ ఉదయ్ గత గురువారం రాత్రి భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉదయ్ మాట్లాడుతూ .. 2005 లో ‘గ్రంధి శ్రీనివాస్’ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను టెన్నిస్, క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తించి ప్రత్యేక సర్టిఫికెట్ ను ప్రభుత్వం ద్వారా ఇప్పించారని, అది తనలో జోష్ నింపిందని తాను లండన్ లో ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ. తన ఎదుగుదలకు సహకరించిన గ్రంధి శ్రీనివాస్ ను మరచిపోలేదని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుందుర్రు గ్రామ సర్పంచ్ ఆరేటి వీరాస్వామి నాయుడు, కొట్టి కుటుంబరావు, మద్దాల రమణ, ఆరేటి శ్రీనివాస్, మద్దాల రమణ, కాకిలేటి బాసు, నిమ్మల బాలసుబ్రమణ్యం, మద్దాల సాయి కుమార్, సత్యనారాయణ, రామిశెట్టి జయ సూర్య, కైలా పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
