సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2019 ఎన్నికలలో భీమవరంలో జనసేనాని పవన్ తో వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ తలపడిన పోరు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతుంది.. మరి ఇటీవల భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించక పోయిన ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు ఇక భీమవరంలో టీడీపీ కి తిరుగుండదని పలువురు క్రింది స్థాయి టీడీపీ నేతలలోనే ప్రచారం జోరు అందుకొంది అసలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చక్రం త్రిప్పే రాజకీయ యోధులు ఉన్న భీమవరం.. ఇక రాజకీయ ప్యూహాలు కు కొదవేమి ఉంటుంది.. . ఈ నేపథ్యంలో తాజగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు. భీమవరంలో జగనన్న కాలనీల పేరుతో నిర్వహించిన భూసేకరణలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు సారాంశం. భీమవరంలో పేదల ఇళ్ల కోసం దాదాపు 140 ఎకరాలు సేకరించారు. బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రోత్సహించారని , అందులో భారీగా లబ్ధిపొందారంటూ పవన్ కల్యాణ్ భీమవరం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ నాగరాణికి పిర్యాదు చేసారు. . భూసేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని సూచించారు. అయితే తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా తనకు పిర్యాదు చేస్తే బాగుంటుందని కలెక్టర్ నాగరాణి .డెప్యూటీ సీఎం పవన్ కు సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చాల దూరంగా జరుగుతున్నా నేపథ్యంలో .. భవిషత్తు లో భీమవరంలో మారనున్న రాజకీయ పరిణామాలు అంచనా వేసి జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగటం ఆసక్తికర రాజకియ పరిణామంగా భావించాలి.
