సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ళు క్రిందట రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తదుపరి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా అప్పటి సీఎం జగన్ నరసాపురం ఎంపిక చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నర్సాపురంలో పెద్ద ఉద్యమాలు కూడా చేసారు. అయితే భీమవరం అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలపై, స్థానిక ప్రముఖుల విజ్ఞప్తుల మేరకు సీఎం జగన్ భీమవరంను ఎంపిక చెయ్యడం తదుపరి పకృతి ఆశ్రమంలోని ప్రెవేటు భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చెయ్యడం ఆగమేఘాలపై జరిగింది. తదుపరి స్థానిక మార్కెట్ యార్డ్ లో జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవనాలకు కావలసిన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ జిఓ కూడా విడుదల అయ్యింది. నరసాపురంలో కాకుండా జిల్లా కేంద్రం భీమవరం రావడం వెనుక గ్రంధి శ్రీనివాస్ తన మంత్రి పదవి ఆఫర్ ను వదులుకోవడమే కారణం అని అప్పటి నర్సాపురంకు చెందిన టీడీపీ నేత,మాజీ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్. ఎం ఏ షరీఫ్ సంచలన ప్రకటన చేసారు. ఈ వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ కూడా భీమవరం ఎన్నికల బహిరంగ సభలో స్వయంగా ధ్రువీకరించారు. కాలక్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. కారణాలు ఏవైనా కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు ప్రారంభం జరగలేదు. అయితే ఇటీవల కాలంలో ఉండి కి చెందినఎమ్మెల్యే రఘురామా.. భీమవరం పట్టణ శివారులోని పెదమిరంలో స్వయంగా నిర్మిస్తానని .. లేదు భీమవరం మార్కెట్ యార్డ్ లో కాకపోయినా భీమవరం నియోజకవర్గంలోనే 8-11 కిమీ దూరంలో 25 ఎకరాలలో నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటనలుతో.. తరలింపు అడ్డుకొంటామని భీమవరంలోని ప్రభుత్వ జిఓ ఇచ్చిన స్థలంలోనే కలెక్టరేట్ నిర్మించాలని శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు ఇతర వైసీపీ, లెఫ్ట్ పార్టీల ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఇదే మంచి అవకాశంగా మరల నరసాపురంలో జిల్లా కేంద్రం సాధన ఉద్యమం మరల తెరమీదకు వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మరియు మాజీ ఎమ్మెల్యే, మాధవ నాయుడు నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రదర్సనలు మొదలు అయ్యాయి. ఎలానూ జిల్లా కలెక్టరేట్ వివాదం వచ్చింది కాబట్టి అది నర్సాపురంకు తరలించాలని గతంలో స్థానిక వైసీపీ నేతల వల్ల తప్పు జరిగిందని ఈసారి నరసాపురం సాధించు కొంటామని భీమవరం అయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని నరసాపురంలో కలెక్టరేట్ కు కావలసిన భవనాలు స్థలం రోడ్డులు విశాలంగా ఉంటాయని వారి వాదన.. దీనిపై వారు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు తో పాటు భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు కూడా నరసాపురం జిల్లా కేంద్రం కోరుతూ విన్నతి పత్రం సమర్పించడం గమనార్హం.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నఅసలు భగీరధుడు గ్రంధి శ్రీనివాస్ మాత్రం ఇంకా ఈ వివాదంపై స్వాందించక పోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *