సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణులు వారి కుటుంబ సభ్యులతో సహా విశేష సంఖ్యలో వారి సన్నాయి, డప్పు,సాంప్రదాయ మేళ తాళాలతో. వాయిద్యాలతో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం వద్దకు వచ్చి ఆయన సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారని వారు గతంలో టీడీపీ జనసేన పార్టీలలో పనిచేశారని సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమం ఫలితంగా ఆ పధకాలు ప్రయోజనం పొందిన తాము ఆయన ప్రభుత్వం కొనసాగాలని కోరుకొంటూ ..కృతజ్ఞతగా వైసీపీ లో చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన కండువాలు కప్పారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమ ధర్మం పాటించి అందరికి అవకాశాలు ఇవ్వడం సీఎం జగన్ కె సాధ్యం అని వీరి చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందన్నారు.
