సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ లోని కాస్మో నగరం వైజాగ్ వేదికగా జగన్ సర్కార్ 2 రోజుల పాటు ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు, శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో దేశంలో అగ్ర స్థానంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ , కరణ్ అదాని, జీఎంఆర్ ,జిందాల్ సభావేదికపైకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా పాల్గొననున్నారు. సీఎం జగన్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రాష్ట్రంలో యువతకు 35 వేల ఉద్యొగాలు, నూతన పరిశ్రమలకు , సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ 50 ఎకరాల ఆవరణ లో ఏర్పాట్లు జరిగాయి. సదస్సుకు పలు దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరు అయ్యారు. సుమారు 20 ప్రత్యేక విమానాలలో పారిశ్రామిక ప్రముఖులు హాజరు అవుతున్నారు. ప్రత్యక సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామిక వేత్తలు మాట్లాడనున్నారు. అతిథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో 750కు పైగా సూట్‌లు, రూమ్‌లు బుక్ చేశారు. ఇవికాకుండా మరో వెయ్యి గదులు తీసుకున్నారు. అన్ని దేశాల వారికీ ఇష్టమైన వంటకాలు హోటళ్ల చెఫ్‌లతో చేయిస్తున్నారు. వీరందరికీ 3న సాయంత్రం ఆర్‌కే బీచ్‌లోని ఎంజీఎం పార్కులో డిన్నర్ ఏర్పాటు చేశారు. కాగా, ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు నెలాఖరులో జి-20 సదస్సు కూడా నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో 100 కోట్ల ఖర్చుతో విశాఖ అందాలకు మరింత మెరుగులు దిద్దారు..
