సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను నేడు, మంగళవారం ఉదయం భీమవరం నియోజకవర్గంలో వాడవాడలా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా పట్టణంలో లేన్నప్పటికీ, ఈసారి రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నప్పటికీ వాటికీ అతీతంగా ఆయన అభిమానులు మాత్రం ఏ మాత్రం జోష్ తగ్గలేదు. ప్రధాన సెంటర్స్ లో భారీ ఫ్లెక్సీ లు కట్టారు. అభిమానులు చేస్తున్న దాదాపు అన్ని సేవ కార్యక్రమాలలో గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ పాల్గొన్నారు. భీమవరం తాడేరు రోడ్ లోని జడ్డు బ్రహ్మాజీ సూర్యకాంతం వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మందికి పైగా రక్తాన్ని ఆనంద బ్లడ్ బ్యాంకు వారికి డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రంధి రవితేజ ఆయన అభిమానుల మధ్య కేకును కట్ చేసి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తన తండ్రి గ్రంధి శ్రీనివాస్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని, పదవి ఉన్న లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో ఆనందం ఉంటుందని మాకు చెప్పేవారని అన్నారు. ఈ కార్యక్రమలలో తోట బోగయ్య,తమరి శరత్ ,వెదురుపర్తి అరుణ్ కుమార్, చలపాక కృష్ణ భవాని మాజీ ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, మాజీ కౌన్సిలర్లు నల్లం రాంబాబు, ఎర్రంశెట్టి చందు, నామన మహేష్, పెన్నాడశ్రీను, చెల్లబోయిన సూర్య ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.
