సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు జన్మదిన వేడుకలు నేడు, బుధవారం భీమవరం పట్టణ శివారులోని పెద్దమిరం లో ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందరో శ్రేయోభిలాషులు ,కూటమి పార్టీల నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, ఈ సందర్భముగా గత 2 దశాబ్దాలుగా ఆయనతో మీడియా పరంగా సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్న మన ‘సిగ్మా న్యూస్’ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆయనకు రాజకీయ భవిషత్తు మరింత ఉన్నతంగా ఉండాలని మరిన్ని ప్రజోప కార్యక్రమాలకు ఆయన ముందుండాలని ఆయురారోగ్యాలతో ముందుకువెళ్లాలని శుభాబినందలూ తెలుపుతున్నాం. ఆత్మాభిమానానికి పరాకాష్టగా నిలిచే రఘురామా కృష్ణంరాజు గతంలో తన పుట్టినరోజన తనను అరెస్ట్ చేసి హింసించిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేశానని .. నేడు, పెద్దమిరంలో ‘ ప్రతీకార దినోత్సవం’ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు ఆయన అభిమానులు కూటమి నేతలు హాజరు అయ్యారు.
