సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, భుధవారం సాయంత్రం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయని తెలుస్తుకొని పలువురుప్రయాణికులు వెళుతున్న ట్రైన్ చైన్ లాగి ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన సుమారు 40 మంది ప్రయాణికులను అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. వీరిలో అక్కడికక్కడే 12 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. అయితే. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
