సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ సమీపంలో నేడు, గురువారం తెల్లవారు జామున పొగ మంచు నేపథ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు మృతి చెందగా.. తీవ్రం గా గాయపడిన మరొకరి పరిస్థితి విషమం గా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 9 మంది పురుషులు,ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్బళ్లాపూర్ పోలీసులు తెలిపారు.
