సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:అనంతపురం జిల్లాలో నేడు, ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద కారు లారీ ఢీకొని ఆరుగురు ఇస్కాన్ కు చెందిన హరే రామ హరే కృష్ణ భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం వైపు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ.. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వస్తున్న ఇస్కాన్ వారి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో.. లారీ కిందకు కారు ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
