సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం లో అమావాస్య నేపథ్యంలో నేటి ఆదివారం ఉదయం చండి హోమం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య ఘనంగా నిర్వహించారు. విశేషంగా దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారు. పట్టణంలోని స్థానిక 3వ వార్డులో 32వ ఆషాఢమాస శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని, ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి జాతర వేడుకలు చేయడం సంతోషకరమని అన్నారు. అనంతరం జాతర వేడుకలను ప్రారంభించారు. శక్తి వేషాలు, గరగల నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతర మహోత్సవ నిర్వాహకులు యాతం శ్రీను, మాజీ కౌన్సిలర్ యాతం నాగలక్ష్మి, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు,,తదితరులు పాల్గొన్నారు.
