సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజు భవనంలో నేడు, ఆదివారం శ్రీబాబు భక్త సమాజ్ ఆధ్వర్యంలో సత్సంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని యోగిని ద్వారా దైవ అస్సిసులు అందుకొన్నారు. భక్తి విశ్వాసాలు ఉన్నవారికి ఆ శిలా విగ్రహంలోనే నీలమేఘ శ్యాముణ్ణి దర్శిస్తారని శ్రీ కాళీవనాశ్రమ పీఠాధిపతి యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ అన్నారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులతో శ్రీలలిత సహస్రనామ కుంకుమ పూజలు ను మాతాజీ నిర్వహించారు. ది భీమవరం ఛాంబర్ గౌరవ అడ్జక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, తుమ్మలపల్లి శివ,బొబ్బిలిశెట్టి రామకృష్ణ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
