సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపు సోదరులు కీలక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మన కాపుల కూడా మేలు చేస్తున్న జగన్ మోహనరెడ్డి ని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. బుద్ధి.. జ్ఞానం లేని పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. వైసీపీ ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఇది నా శాసనం.. ఓట్లు చీలనివ్వను అంటాడు.. జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని అడ్డుకొనే అంత పెద్ద మగాడా పవన్ అంటూ చెలరేగిపోయారు. కొందరు మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్నారు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్‌తో కలిసి చాకిరి చెయ్యాలని గుర్తు పెట్టుకోండి అన్నారు. భీమవరంలో కానీ గాజువాక లోకాని, ఒక్కచోట కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసుకొని పవన్ ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడంటూ ..తాను ఎవరివద్దాయిన ఒక్కపైసా ఆశించానా? తాను అవినీతి చెయ్యకుండానే పవన్ నన్ను విమర్శించడమేమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
