సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేటి గురువారం మీడియా సమావేశంలో భీమవరంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ నుద్దేశించి చేసిన వాహభావాలుపై ధ్వజమెత్తారు. జగన్ సర్కర్ కు రాష్ట్రంలో చెక్కుచెదరని ప్రజాభిమానం చూసి పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారాహి అంటే అమ్మ వారి పేరు. అమ్మవారి పేరు పెట్టుకుని వాహనం పైకి ఎక్కి మాట్లాడటం సరికాదు. రాజకీయాలలో చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ చేసే ప్రతి పనికి ఒక కథ ఉంది. సినిమాలో పవన్ కథానాయకుడు. రాజకీయల్లో కంత్రీ నాయకుడు. పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పవన్ రాజకీయాలకు అన్హరుడు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డబ్బింగ్ చెబుతున్నారు. లోకేష్ యువగళానికి అసలు గళం లేదు. టీడీపీది బస్సు యాత్ర కాదు.. అది తుస్సు యాత్ర. టీడీపీ బస్సు యాత్రకు టీడీపీ కార్యకర్తలు కూడా రాలేదు. ఇక నాకు సెల్ఫీ చాలెంజ్ చేసే నైతిక అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదు. కన్నా టీడీపీలో ఉంటారో.. మరో పార్టీ మారతారో తెలియదు.’’ అని ఎద్దేవా చేసారు.
