సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీంకోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ విషయంలో ఊరట లభించింది. ఏపీలో ఐఆర్ఆర్ స్కాం కేసులో చంద్రబాబు కు బెయిల్ రద్దు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం పెట్టుకొన్న పిటిషన్ ఫై విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. నేడు, సోమవారం ధర్మాసనం విచారణ లో.. . గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పీని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం స్పష్టం చేసింది.
