సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉన్నత పదవి అధిష్టిస్తారని భావిస్తున్న ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, శుక్రవారం ఢిల్లీలో కాబోయే సీఎం చంద్రబాబు ను కలసి పుష్ప గుచ్చం అందించి శుభాబినందలూ తెలిపారు. కొద్దీ సేపు కొత్త ప్రభుత్వ నిర్ణయాలు ఫై చర్చించుకోవడం జరిగింది. అయితే ముందుగా అనుకున్నట్లు 9వ తేదీన కాకుండా ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈనెల 9న ప్రధాని మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ కూడా రానున్నారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో సభ నిర్వహిస్తే అందరికీ అనువుగా ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *