సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో సాగర్ గ్రంధి ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ నుండి గ్రంధి బాలాజీ, గ్రంధి చల్లారావులు సోదరులు ఒక కోటి రూపాయల విరాళాన్ని అమరావతిలోని సెక్రటేరియట్ లో గత శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడలో వరదల నేపథ్యంలో ప్రజలు సర్వం కోల్పోయారని, వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం అభినందనీయమని, ఈ సందర్భంగా గ్రంధి బాలాజీని, చల్లారావులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే అనిల్, మాజీ ఎమ్మెల్సీ బీరా రవిచంద్రన్ లు పాల్గొన్నారు. భీమవరం మాజీ ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ సోదరులు అయిన గ్రంధి చల్లారావు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉత్తమ బిజినెస్ మెన్ అవార్డు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకొన్నారు. అయితే ప్రస్తుతం భీమవరం లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీ లో చేరుతున్నారు అన్న విశ్లేషణల మధ్య .. ఫై స్థాయిలో కాకపోయినా..నాయకత్వ లేమితో బాధపడుతున్న లోకల్ టీడీపీ నేతలు ఆయనను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అన్న ప్రచారానికి ఈ తాజా ఘటన పరోక్షంగా జోష్ పెంచుతుంది అనటంలో సందేహం లేదు. టీడీపీ కి ఎప్పుడు ఏ కష్టా కాలం ఎదురు అయినా జిల్లాలో ఊపిరి పొసే భీమవరంలో మొన్నటి ఎన్నికలలో కూటమి పొత్తులో భాగంగా అటు ఎమ్మెల్యే , ఇటు ఎంపీ ఎన్నికలలో కూడా పార్టీ సైకిల్ గుర్తు పోస్టల్ బ్యాలెట్ లో చూడలేకపోవడం టీడీపీ క్యాడర్ ను ఇప్పటికి బాధిస్తుంది. గతం.. గతః గ్రంధి శ్రీనివాస్ లాంటి వీర మాస్ లీడర్ టీడీపీ కి చాల అవసరం అని కొందరు టీడీపీ కీలక నేతలు తమ అభిప్రాయాన్ని అధిష్టాన పెద్దల వద్ద పరోక్షంగా ఆఫ్ ది రికార్డు గా వినిపిస్తున్నారు. అయితే వైసీపీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గ్రంధి శ్రీనివాస్ తన రాజకీయ పయనం ఫై మరి కొద్దీ నెలలు విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. మరి గ్రంధి శ్రీనివాస్ సోదరులు, వారి కుమారులు సైతం ఎప్పుడు కష్టమైన నష్టమైనా ఏటికి ఎదురు ఈదాలన్న.. ఒకేమాట ఫై ఉంటారని అందరికి తెలిసిందే..అయితే అధికారం ఉన్న లేకపోయినా తండ్రి, మాజీ మునిసిపల్ చైర్మెన్, స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు హయం నుండి 40 ఏళ్ళు పైగా టీడీపీ కి ఎదురొడ్డి పోరాడిన భీమవరం గ్రంధి వారి కుటుంబం పసుపు కండువా కప్పుకొంటె అదో చరిత్ర మలుపే మరి..
