సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సస్పెన్సు నేటి ఆదివారం రాత్రి 7 గంటల తరువాత కోర్ట్ సంచలన తీర్ఫు తో విడిపోయింది. స్కిల్ డెవలప్మెం ట్ స్కా మ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చం ద్రబాబు 370 కోట్ల పైగా భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈరోజు(ఆదివారం ) ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘం గా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సాయంత్రం గం .6.50ని.ల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ నెల 22వరకూ రిమాండ్ విధించింది . నేడు సమయం మించిపోయింది కాబ్బటి రేపు సోమవారం తెల్లవారు జామున చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి తరలింపుకు వెళ్లే రూట్ లో భద్రత ఏర్పాట్లు ను పోలీసులు పూర్తీ చేస్తున్నారు.
