సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి, మంగళవారం ఉదయం సమావేశం అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై రావలసిన నిధులు ఫై చర్చించారు.అలాగే పదవుల భర్తీ లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలకు రావలసిన కేటాయింపులులో న్నాయం చెయ్యాలని ప్రాధాన్యత పెంచాలని కోరినట్లు తెలిసింది. తిరుమల లడ్డు నెయ్యి వివాదంలో భక్తులలోకి వెళ్లిన సంకేతాలు పైనా..వాటి నష్ట నివారణ చర్యలు పైన.. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పనుల గురించి, అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ వివరాలను సీఎం చంద్రబాబు కి పవన్ వివరించారు.
