సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు కోర్టులలో స్కిల్ అవినీతి కేసులలో ఇరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. తొలుత ఏసీబీ కోర్ట్ జైలు రిమాండ్ గడువు పెంచడం తో మొదలయి..చంద్రబాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు నేపథ్యంలో .. గత 2 రోజులుగా ఏసీబీ కోర్టులో రిజర్వ్ చేసిన తీర్పు కూడా నేటి మధ్యాహ్నం ప్రకటించారు. చంద్రబాబును సీఐడీ కస్టడీకి విచారణ చేసుకోవడానికి అనుమతిస్తూ ACB కోర్టు తీర్పు ప్రకటించడం తో ఇక సీఐ డీ అధికారుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇంకా చంద్రబాబు ఫై ఉన్న అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్ : 23వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ : 26వ తేదీకి వాయిదా పడిన విషయం ఇక్కడ గమనార్హం..
