సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం లో జనసేన అధినేత పవన్ స్వయంగా వచ్చి ఆయనను కలిశారు.( టీడీపీ , జనసేన పొత్తు కు ఇక అధికారిక ప్రకటనే తరువాయి..? మరి బీజేపీ తో జనసేన పొత్తు ఏమి కానుందో?) 2గంటల సుదీర్ఘ సమావేశం తరువాత మీడియా తో ఇరువురు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కుప్పం ఘటనపై చంద్రబాబుతో చర్చించినట్లు పవన్ తెలిపారు. ‘‘బ్రిటిష్ వాళ్లు తెచ్చిన జీవో నెం.1తో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోంది. వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే జీవో నెం.1 తెచ్చారు,వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసు. అందుకే కేసులు, గొడవలు, కుట్రలతో వైసీపీ విశ్వరూపం చూపిస్తోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నా.’’ అని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని,. ‘‘జీవో నెం.1 తీసుకొచ్చి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్ను హింసించారు. ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కుప్పం వెళ్తానంటే అడ్డంకులు సృష్టించారు. వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతాం. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారమైంది. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైంది. ఇక అన్ని రకాల పోరాటాలు చేస్తాం.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
