సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ ఫై విజయవాడ లోని ఏసీబీ కోర్టులో నేడు,బుధవారం సాయంత్రం వరకు జరిగిన ఇరుపక్షాల లాయర్లు వాదోపవాదాలు ముగిసాయి. వాదనలు విన్న న్యాయమూర్తి రేపు గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. కోర్టులో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్న వోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ‘ఈ కేసుతో ప్రమేయం ఉన్న చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉం ది. అని సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యా యవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వా ల్లు వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని కోర్టు దృ ష్టికి తెచ్చా రు. 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. దర్యా ప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుంది’’ అని వాదనలు లో ప్రశ్నించారు.
