సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్లు విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం జరుగుతుందని భీమవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం గాంధీనగర్ లో బుధవారం భీమవరం పట్టణ టీడీపీ అధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ రూ. 4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.
