సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు కి రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చి న తీర్పు పై రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో కుంభకోణాలు చేసి తప్పించుకున్న చంద్రబాబు కు ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా మరో 7 కేసులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. వీళ్ళ పాపాలు పడిపోయాయి ఇక దర్మాన్ని కాపాడే భాద్యత ఈ ప్రభుత్వం తీసుకొందన్నారు…ఈరోజు చంద్రబాబు జైలుకు వెళ్లారు ఇప్పటి వరకూ ఎలాగోలా వ్యవస్థలను మేనెజ్ చేసి తప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు కుదరదని ఈ కేసులో చంద్రబాబుకు తప్పకుండా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తర్వాత రామోజికి కూడా జైలు శిక్ష తప్పదని అన్నా రు. టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై ఎటువంటి రాజకియ కక్ష లేదని అవినీతి చేసాడు పూర్తీ ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
