సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3వ సారి సీట్లపంపిణీపై జరిగిన గత ఆదివారం భేటీ పై టీడీపీ కి అనుకూల మీడియాలో 20 -25 సీట్ల కు మించి జనసేన కు ఇవ్వరు? అంటూ వస్తున్నా కథనాలపై.. పవన్ కళ్యాణ్ కూడా మనం ఎన్ని సీట్లు లో పోటీ చేస్తాం అని కాదు.. పోటీ చేసే సీట్లలో 98 శాతం గెలవలసిందే.. అంటూ నర్మగర్భంగా వ్యాక్యలు చేసిన నేపథ్యంలో.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ నర్సాపురం ఎంపీ హరి రామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరో లేఖ రాశారు. చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని..కనీసం 50 సీట్లకు పోటీ చెయ్యాలని.. జనసేనకు 30 లేదా 27 సీట్లంటూ ఏకపక్షమైన వార్తలు ఎల్లోమీడియా ఎవరిని ఉద్ధరించడానికని , కూటమి అధికారంలోకి వస్తే కనీసం రెండున్నరేళ్లు పవన్ సీఎం గా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య తాజా లేఖలో డిమాం డ్ చేశారు. కాపుల మద్దతు లేకుండా జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారం లోకి రావడం కష్టమని.. అందుకే 2019 ఫలితాలే ఉదాహరణ అని జోగయ్య పేర్కొన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *