సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంచలనమ్ రేపిన చంద్రబాబు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియా సమావేశంలో వివరిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చం ద్రబాబు నాయుడ్ని ఇవాళ ఉదయం ఆరుగం టలకు నం ద్యా లలో అరెస్ట్ చేశాం. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఆయన ప్రధాన కుట్రదారుడు.. ప్రభుత్వ ధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసులో దొరికిన ఆధారాల ప్రకారం ఫైనల్ బెనిఫిషీయరీ కూడా చంద్రబాబే. దర్యాప్తులోనూ ప్రధాన నిందితుడు ఈ కేసులో నారా లోకేశ్ పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. మొత్తం రూ.550 కోట్ల స్కాం దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింది. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి .. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. చంద్రబాబును కస్టోడియల్ విచారణ చేయాల్సిందే. మేము న్యాయపరంగా అన్ని చర్యలుతీసుకునే అరెస్ట్ చేశాం అన్నారు.
