సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన వ్యవహారం పార్లమెంట్ ను తాకింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఆ అరెస్ట్ ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పందించాలని కోరగా.. వైసిపి ఎంపీ మిదున్ రెడ్డి దానికి కౌంటర్ గా .. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, అన్ని ఆధారాలు ఉన్నందునే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఈ స్కాం లో ప్రజలు సొమ్ము రూ.371 కోట్ల లూటీ జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నందునే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. కేంద్ర సంస్థ ఐటీ కేసులో చంద్రబాబు సైతం ఇదే కేసులో నోటీసులు అందుకున్నారు. చంద్రబాబు పీఏకు సైతం ఐటీ నోటీసు ఇవ్వగా.. ఆయన విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీ లకు మళ్లించినట్లు కేంద్ర ఈడీ దర్యా ప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు ఎన్నో అవినీతి కేసులలో 26 సారులు చంద్రబాబు కోర్ట్ స్టే లు తెచ్చుకొంటూ తప్పించుకుంటూ రాగలిగారు. చిట్టచివరకు చంద్రబాబు చట్టానికి చిక్కారు. అన్నారు. అయితే, మిథున్ రెడ్డి ప్రసంగాన్ని మధ్యలో టీడీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ సమయం లో స్పీకర్ జోక్యం చేసుకున్నా రు. ఈ కేసు విచారణ కోర్టులోఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ అంశం పైన సభలో చర్చకు ఇక అనుమతించనని స్పష్టం చేశారు.
