సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి భోజనం వస్తున్నప్పటికీ .. ఆరోగ్యం బాగోలేదని 5 కేజీలు బరువు తగ్గారని ఆయన భార్య భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చెయ్యగా.. చంద్రబాబు ఆరోగ్యం బాగుందని గతంలో కన్నా అదనంగా కేజీ బరువు పెరిగారని అధికారులు ప్రకటించడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు,శుక్రవారం మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఆరోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని, అభివృద్ధిలో చంద్రబాబును అధిగమించలేక అక్రమ కేసులతో ఆయనను జైలుపాలు చేసి 5వారలు గడుస్తున్నా పగ చల్లారలేదా? అని ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ను ఇబ్బంది పెడతారా? అంటూ మండిపడ్డారు. ఫేక్ హెల్త్ రిపోర్టులు ఇచ్చి ఎవరిని మభ్య పెడదామనుకుంటున్నారని నిలదీశారు. చంద్రబాబుకు వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యలను అనుమతించాలని.. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అని బాలకృష్ణ అన్నారు.
