సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చంద్రబాబు రాజకీయ ప్యూహాలు శరవేగంగా మారుస్తున్నారు. మొన్న ఢిల్లీలో జాతీయ ప్రెవేటు మీడియా ఛానెల్స్ లో బీజేపీ ని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ప్రధాని మోడీని ప్రశంసిస్తూ.. ఎన్టీయే లో చేరడానికి సంసిద్ధత వ్యక్త పరచడం, నిన్న రజని కాంత్ చంద్రబాబు విజన్ అపూర్వమని పొగడడం.. జరిగింది. ఇదిలా ఉండగా నేటి, శనివారం సాయంత్రం ఎవరు ఊహించని రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి వచ్చి ఆయనలో సమావేశం అయ్యారు. పవన్ భేటీపై అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ ఏ ఒక్కరికీ ముందస్తు సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండుసార్లు జరిగిన ఈ ఇద్దరి భేటీ అధికారికంగానే జరిగింది. అయితే ముచ్చటగా మూడోసారి జరిగిన ఈ భేటీపై ఇరుపార్టీల కీలక నేతలకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలేం జరుగుతోందని రాజకీయ పరిశీలకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు తో ఈ అరగంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కూడా నాదెండ్ల కూడా లేరు కాబ్బటి వారిరువురు అధికారికంగా స్వాందిస్తేనే పొత్తుల సమాచారం బయటకు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *