సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్ర వారంలో నేడు, సోమవారం అధికార వైసిపి ప్రభుత్వంలోని కాపు వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తో సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ కాపు నేతలు స్పష్టం చేశారు. తొలుత కాపునేత, మం త్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎమ్మె ల్యే టికెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్ మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కాపులకు అండగానిలిచారు. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెం దిన ప్రజాప్రతినిధులతో విస్తృ తస్థాయి సమావేశం నిర్వహిస్తాం ’అని అన్నారు. ఉప ముఖ్య మంత్రి కొట్టు సత్య నారాయణ మాట్లాడుతూ..‘ పీఆర్పీకి ద్రోహం చేసినవారికి సమాధానం చెబుతానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నే హం చేస్తున్నాడు. చం ద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నాడు. ఉన్మా దిలా మాట్లాడుతున్నా డు.’ అనిఅన్నా రు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులను ఎన్ని రకాలుగా క్షోభ పెట్టాడో అందరికి తెలుసునని, వంగవీటి రంగా హత్య లో చంద్రబాబు ప్రమేయంఉందని, ముద్రగడ పద్మనాభం ను వారి కుటుంబాన్ని తీవ్రంగా అవమానించాడని, వారికీ మద్దతుగా ఉద్యమించినా కాపులపై పెట్టిన ఎన్నో కేసులు ఎత్తివేయలేదని, సీఎం జగన్ మాత్రమే అధికారంలోకి వచ్చాక ఒక్క కలం పోటుతో ఎత్తివేసారని కాపులు గుర్తుంచుకోవాలని, చంద్రబాబు ను సీఎం చెయ్యడానికి కాపులను ఆయన పల్లకి మొయ్యాలని పవన్ కళ్యాణ్ కాపు యువతను ప్రేరేపిస్తున్నాడని ఇది చాల దారుణమైన విషయం కాపులు గమనించాలని కాపు ఎమ్మెల్యే లను పవన్ దూషించడాన్ని ఖం డిస్తున్నాం . సీఎం జగన్ అన్ని రకాలుగా కాపులకు అండగా నిలిచారు. పవన్ చంద్రబాబు ల ముసుగు తొలగింది. అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *